బుల్లితెర నటీనటులు ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమైన కథలో రాజకుమారి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఆషికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటించిన మొదటి సీరియల్ తోనే విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈమె గత ఏడాది బిజినెస్ మెన్ చేతన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే గత ఏడాది బెంగళూరులోని ప్రముఖ హోటల్లో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈమె ఒక కార్యక్రమంలో భాగంగా తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. ఇదిలా ఉండగా సోమవారం ఈమె మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈమె పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా ఆషికా చేతన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నటి మాట్లాడుతూ తను పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ లో చేస్తానని వెల్లడించారు.
కథలో రాజకుమారి సీరియల్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని అనే సీరియల్ లో నటిస్తున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ జీ తెలుగులో టాప్ రేటింగ్ సంపాదించుకుని దూసుకుపోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…