సినీ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. ఈమె పలు కార్యక్రమాలు పలు సినిమాల్లో నటిస్తూ విశేష ప్రేక్షక అభిమానుల సంపాదించుకున్నారు. అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా ఏం పోస్ట్ చేసినా తిరిగి ఆమె మెడకే చుట్టుకుంది.
ఈ క్రమంలోనే గతంలో ఎన్నోసార్లు మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు పై తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి చేదు అనుభవం లక్ష్మీప్రసన్న మరోసారి ఎదుర్కొంటుంది. తాజాగా కన్నడ సినీ నటుడు పునీత్ మరణం గురించి లక్ష్మీప్రసన్న చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా ఆయన మృతి చెందిన విషయాన్ని తెలియజేస్తూ పునీత్ మరణం పట్ల లక్ష్మి ప్రసన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ ఒకవైపు నటుడు పునీత్ ఆస్పత్రిలో గుండెపోటుతో చేరి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.అతనిని కాపాడటం కోసం వైద్యులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
అయితే ఆయన మృతి చెందిన విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించక ముందే మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా అతని మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు మీకు అంత తొందర అంటూ ప్రశ్నిస్తున్నారు.కేవలం ఈమె మాత్రమే కాకుండా పలువురు నటీనటులు కూడా ఇలాగే స్వీట్ చేశారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…