ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నా.. బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే సెప్టెంబర్ 5 న ప్రారంభం కాబోతుండటంతో ఆ వేడుకకు సమయం దగ్గరపడుతున్న కొద్ది షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లపై ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేసినట్లు.. వాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించి కొంతమందిని క్వారంటైన్ లో కూడా ఉంచినట్లు తెలుస్తోంది.
దాదాపు 20 రోజులు వారిని గృహ నిర్బంధంలో ఉంచేందుకు ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది.. కాకపోతే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. థర్డ్ వేవ్ భయాందోళనలతో నిర్వాహకులు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇక సెలెక్టయిన విషయం వాళ్లు బయటకు చెప్పకున్నా ఫైనల్ జాబితాలో ఉన్న సెలబ్రిటీలు తమకు కావాల్సిన షాపింగ్, ఇతర పనుల్లో బిజీగా ఉన్నారనే విషయం తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ముఖ్యంగా ఈ సారి మహిళలను ఎక్కువగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. లేడీ సెలబ్రిటీల్లో ప్రియా రామన్, ఆర్టిస్టు ప్రియ, సిరి హనుమంతు, అన్నీ మాస్టర్, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, సురేఖ వాణి, నవ్యస్వామి, ప్రియాంక సింగ్, టీవీ9 ప్రత్యూష, ఆర్జే కాజల్, వర్షిణి సౌందర్యరాజన్, తదితరులు పేర్లు ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక జెంట్స్ కేటగిరీల్లో శేఖర్ మాస్టర్, దుర్గారావు, సిద్దార్థ్ వర్మ, యాంకర్ రవి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే లేడీలల్లో ఎక్కువగా పెళ్లైన వాళ్లే ఉన్నారని ప్రాథమిక సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు ఈ ఊహాగానాలు ఇలానే వస్తూనే ఉంటాయి. అయితే డిసెంబర్ 19 న ఫైనల్ జరిగే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…