బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షోలో 19 మందిలో కొంతమంది తెలిసిన కంటెస్టెంట్లు ఉన్నారు. తెలియని వారు కూడా ఉన్నారు. ఇందులో ఎక్కువగా తెలిసిన వారిలో సిరి హనుమంతు ఒకరు. ఈమె గురించి చెప్పుకుంటే.. హౌస్ లో ఎంతో యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. ఏ టాస్క్ ఇచ్చినా చక చకా చేసేస్తుంది. ఇలా చలాకీగా ఉండే సిరి మొదట కెప్టెన్ కుడా ఎంపికైంది.
ఈ విషయం అందరికీ తెలిసిందే. య్యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలింలో చేసిన సిరికి అభిమానులు కూడా బాగానే ఉన్నారు. అయితే ఆమె గురించి నెటిజన్లు ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. అందేంటంటే.. హౌస్ లోకి రాకముందే సిరికి నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. నటుడు శ్రీహాన్‌తో పరిచయం ఏర్పరచుకొని దానిని ప్రేమగా మలుచుకున్నారు.
ఇలా అయిన వెంటనే ఆమెకు బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో వెంటనే ప్రియుడిని వదిలేసి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. శ్రీహాన్ కు.. సిరికి ఓ కొడుకు ఉన్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అయింది. ఇందులో నిజం ఉంది.. అంతకంటే అబద్ధం కూడా ఉంది. నిజం ఏంటంటే.. వారిద్దరికి కొడుకు ఉన్నాడు. అబద్దం ఏంటంటే ఆ కొడుకు వీళ్లకు జన్మించిన వాడు కాదు.
వివరంగా చెప్పాలంటే.. వాళ్లిద్దరు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్ చేసుకుంటున్నారట.. దీనికి సంబంధించి సిరిని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె అవుననే సమాధానం ఇచ్చారు. దీంతో సిరిపై నెటజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలనటుడికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన రావడం గొప్ప విషయం అంటూ పొగుడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…