బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షో రాను రాను రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు ద్వేషించుకుంటూ దూసుకుపోతున్నారు. దానికి తగ్గట్లే బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ ను ఇచ్చారు. ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడిపోతూ.. కుమ్మేసుకుంటూ ఆడేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మొదలైన ఈ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. ప్రోమోను విడుదల చేసినదాన్ని బట్టి చూస్తే నేడు పోరు వేరే లెవల్లోకి వెళ్లే విధంగా కనిపిస్తోంది.
రవి, శ్రీరామచంద్రల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీనిలో మొదట శ్రీరామ్ మాట్లాడుతూ ‘నువ్వు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు.. నాతో మైండ్ గేమ్ ఆడొద్దు అంటూ శ్రీరామ్ రవితో అనగా.. దానికి రవి.. ‘ఇది నా గేమ్ బ్రో అంటూ రవి అంటాడు. శ్రీరామ్ రవితోనే కాదు మానస్ దగ్గర కూడా గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. వాళ్లకు వీళ్లకు చెప్పడం కాదు.. నాతో ప్రాబ్లమ్ ఉంటే నాదగ్గర చెప్పు అని శ్రీరామ్.. అనగా మానస్ దానికి ‘నువ్ వినే పొజిషన్ లో లేవు’ అంటూ మానస్ కూడా వాయిస్ రైజ్ చేసి చెప్పాడు.
‘నువ్ ఇంకా చిన్నపిల్లోడివి’ అని శ్రీరామ్.. ‘నీ ఏజ్ ఎక్కువ ఉన్న మెచ్యూరిటీ చూడు ఎలా ఉందో’ అంటూ మానస్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఇక గేమ్ కు సంబంధించి వాళ్ల టీం సభ్యులతో రవి మాట్లాడుతూ.. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని టార్గెట్ చేద్దాం అంటూ చెబుతాడు. ఇక శ్రీరామ్ వాళ్ల టీం సభ్యులతో మనకు దేహ బలం తక్కువగా ఉంది.. కాబట్టి కొంచెం మైండ్ తో ఆడదాం’ అంటూ చెబుతూ కనిపించాడు. గేమ్ మధ్యలో శ్రీరామచంద్ర ‘పగిలిపోద్ది చెప్తున్నా’ అంటూ సన్నీకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తరువాత సిరి.. శ్వేతాను రెచ్చగొడుతూ కామెంట్ చేయడంతో ఆమె సిరి పైకి దూసుకెళ్లింది.
అది చూసిన యానీ మాస్టర్ ‘శ్వేతా నువ్ వెరీ వెరీ వైల్డ్’ అని కామెంట్ చేస్తుంది. అక్కడనే ప్రియా సాయంత్రం అయ్యేసరికి ఏమైనా దెయ్యం పట్టుకుంటుందేమో ఆమెకు అంటూ చురకలు అంటిస్తుంది. మగాడివైతే ఆడుదువు రా అంటూ.. ప్రియ ఎదుటి టీం సభ్యుడైన సన్నీని రెచ్చగొట్టగా.. మగాడు గిగాడు మాటలు వద్దు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇస్తాడు సన్నీ.. ఇలా ప్రోమో అంతా హాట్ హాట్ గా అనిపించింది. చూడాలి ఈ రోజు ఎపిసోడ్ లో ఏమవుతుందో.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…