ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరో వారంలో ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపించేశారు.
అందులో శ్వేత ఎలిమినేట్ కాగా.. లోబోను సీక్రెట్ రూంకి పంపించేశారు. ఇంత వరకు అందరికీ తెలిసిందే. 19 మంది హౌస్ లో కి అడుగుపెట్టగా మొత్తం 6 గురు బయటకు వచ్చేశారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమిదా మరియు శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చారు.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ ఇంత వరకు హౌస్ లోకి కొత్త వాళ్లను ఒక్కరిని కూడా పంపించలేదు. ఇదిలా ఉండగా.. శ్వేత వర్మ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ది రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించిన శ్వేత పలు వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం ముగ్గురు మొనగాళ్లు సినిమా అమెజాన్ ఓటీటీ విజయవంతగా నడుస్తోంది.
అయితే శ్వేత ఎలిమినేట్ తర్వాత అంతా ఆమె పారితోషికం గురించే మాట్లాడుతున్నారు. అయితే పాపులారిటీని బట్టి ఈ పారితోషికం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టీ ఆమెకు వారానికి రూ.60 నుంచి 90 వేల వరకు ఇస్తున్నారట. ఆమె హౌస్ లో ఆరువారాల వరకు ఉంది. దీంతో ఆమెకు దాదాపు రూ.5 లక్షల వరకు బిగ్ బాస్ నిర్వాహకులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…