మా ఎన్నికలలో అధ్యక్షత పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన అక్క మంచు లక్ష్మి, తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వారికి బలాన్ని చేకూర్చాలని భగవంతుని ప్రార్థించామని తెలిపారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మా చాలా బాగుందని.. దీనిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరో మూడు నెలల్లో మా భవనానికి సంబంధించి ఓ స్పష్టత తెలియజేస్తామని చెప్పారు. ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తమ్ముడు విష్ణుకు అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మా అధ్యక్షుడిగా విష్ణు గెలుపు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి మంచు లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే దత్తన్న నిర్వహించిన అలయ్, బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటూ పెద్దఎత్తున కథనాలు ఆల్లుతున్నారు. అయితే అవి నిజం కాదని మంచు లక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు మంచు చాలాసేపు మాట్లాడుకున్నారని, వారిద్దరూ ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నారు.మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవు మేమందరం ఒక్కటేనని, మా మధ్య విభేదాలు ఉన్నాయని లేనిపోని కథనాలను సృష్టించ వద్దంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…