సినిమా ఇండస్ట్రీలో గత 4 దశాబ్దాల కాలం నుంచి ఒక విలక్షణ నటుడిగా, కమెడియన్ గా,ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు గత కొద్ది రోజుల నుంచి పలు ఇంటర్వ్యూల ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇక మా ఎన్నికలలో భాగంగా కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ ప్యానల్ పై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి అతడికి క్రమశిక్షణ లేదు షూటింగ్ లకు సరిగ్గా రారు. అలాంటిది మా బాధ్యతలను సక్రమంగా ఎలా నిర్వర్తిస్తారు అని అతనిపై ఆరోపణలు చేశారు.
కోట శ్రీనివాస్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ కోట శ్రీనివాస్ రావు గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కోటాకి మనిషి లక్షణాలు లేవని అతడు ఒక జంతువని.. రేపు మా పో పోయి నీకు ఇలాంటి మాటలు ఎందుకు అంటూ అతని వయసు కూడా గౌరవం లేకుండా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఎన్నికల అనంతరం కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు ఎవరు? నాగబాబు చెప్పుకోదగ్గ నటుడు ఏమి కాదు.మా లో నాగబాబు ఉన్నా కానీ ఒరిగేది ఏమీ లేదు. అసలు ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం నువ్వే అంటూ తనదైన శైలిలో కోటా ఆరోపణలు చేశారు.
మా బాధ్యతలను చూసుకోవడానికి దాసరి తర్వాత చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్ కూడా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మోహన్ బాబు కోపిష్టి కానీ అతను చాలా మంచివాడని మాటమాత్రం కర్కశంగా ఉంటుందని, తాను ఒక సామాజికవర్గాన్ని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. గత నలభై సంవత్సరాలుగా నూటికి 95శాతం కమ్మవారి భోజనం చేస్తున్నానని, మిగిలిన 5 శాతం రాజులు, రెడ్డిలు మొదలగు వారు పెంచి పోషించారు. 95శాతం నేను తినేది కమ్మవారి ఫుడ్ అని ఓపెన్ గా చెబుతున్నాను. ఆ విశ్వాసంతోనే మంచు విష్ణు ఓటు వేశానని అని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…