Featured

బిగ్ బాస్ హౌస్ లో మూడో రోజు రచ్చ రచ్చ.. కంటతడి పెట్టిన కాజల్.. ఓదార్చిన రవి..

బిగ్ బాస్ లో అసలు మజా మొదలైంది.. తొలి రోజు పరిచయాలు, రెండో రోజు నామినేషన్ ఘట్టం ముగిసింది. మూడో రోజు ఆట హాట్ హాట్ గా కొనసాగింది. కంటెస్టెంట్ల మధ్య ఎమోషన్స్, మాటల యుద్ధం, కాంప్రమైజ్ లు, సారీల తో ముందుకు సాగింది. స్క్రీన్ స్పేస్ కోసం ఫుల్ హడావుడి చేశారు. ఏడుపులు, పెడబొబ్బలతో దద్దరిల్లింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మాటల తీవ్రతతో హీట్ పెరిగింది.

అటు.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తన జీవితంలోని బాధాకర విషయాలను చెప్పుకుని కంటతడి పెట్టింది. తాను ఎందుకు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిందో చెప్పింది. ఈ మార్పు కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించింది. తాను ట్రాన్స్ జెండర్ గా మారకుండా ఉండి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెద్ద మోసం చేసేదానినని చెప్పింది. నేను కూడా మోసం చేసుకున్నట్లు భావించే దాన్ని అని వెల్లడించింది. తన బాధను క్లోజ్ ఫ్రెండ్ నిషాతో చెప్పుకున్నట్లు వెల్లడించింది. దాంతో ఇద్దరం వెళ్లి ఆపరేషన్ చేసుకున్నట్లు చెప్పింది. ఆపరేషన్ అయ్యాక తను అనుభవించిన బాధ జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. ఆ నొప్పితో నరకం చూసినట్టు చెప్పింది. తన బాధ చెప్పుకుంటూ కంటతడి పెట్టింది. ఆమె బాధ చెప్పుకున్న తర్వాత సైడ్ ప్లీజ్ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఆ తర్వాత ఉమా దేవి గరం గరం అయ్యింది. వంట దగ్గర ఎవ్వరు సహాయం చేయడం లేదని మండిపడింది. అక్కడే ఉన్న శ్వేత, సరయు.. ఉమాదేవి కోపంపై నవ్వారు. నవ్వుతూ కోప్పడకండి అని చెప్పారు. కొంత మంది అస్సలు వంట పనిలో సాయం చేయడం లేదని సరయు రుసరుసలాడింది.

అటు కాజల్, లహరి మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. లోబో, సిరి మధ్య గొడవ షురూ అయ్యింది. అటు పవర్ రూమ్ టాస్క్ ధూమ్ ధామ్ గా జరిగింది. ఇందులో విశ్వ విన్ అయ్యాడు. ఇద్దరు కంటెస్టెంట్లు ఒంటిపై ఉన్న బట్టలతో పాటు అన్ని స్టోర్ రూంలో పెట్టాలి అని బిగ్ బాస్ చెప్పాడు. దీనికోసం ప్రియా, రవి పేర్లను విశ్వ సూచించాడు. దీంతో వారిద్దరూ తమ బట్టలతో పాటు అన్ని వస్తువులను స్టోర్ రూంలో పెట్టి.. వారు తమ అపొజిట్ వ్యక్తుల బట్టలు వేసుకున్నారు.

మరోవైపు కాజల్, లహరి ఒకరిపై మరొకరు మాటలతో విరుచుకుపడ్డారు. కాజల్ కావాలనే తనపై అనవసరంగా టార్గెట్ చేసినట్లు మండిపడింది. లహరిని కూల్ చేసే ప్రయత్నం కాజల్ చేసినా తను ఒప్పుకోలేదు. అనవసరంగా తనను కామెంట్ చేస్తే ఊరుకోనని చెప్పింది. చివరకు కాజల్.. లహరికి సారీ చెప్పింది. కంటతడి పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు రవి, మానస్ ఓదార్చారు. దీంతో మూడోరోజు ఎపిసోడ్ క్లోస్ అయ్యింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago