కరోనా మొదలైన దగ్గర నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు ఎంతో మంది ప్రజలు కరోనా కారణంగా మరణించారు. వారిని నమ్ముకున్న ఎంతో మంది కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొంత మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇతర రంగాల్లో పని చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ఆ ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగుల పై పడలేదనే చెప్పాలి.
ఎందుకంటే.. లాక్ డౌన్ సమయంలో కూడా.. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను అనుసరించాయి. అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ కంపెనీలు వెల్లడించాయి.
దీంతో ఇప్పుడు ఆ పనికి స్వస్తి పలకనున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో వర్క్ ఫ్రం హోంకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్ తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరిలోనైనా.. లేదా ఈ సంవత్సరం చివర్లో అయినా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్ గోపీనాధన్ తెలిపారు.
మొత్తం 5 లక్షల మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి తెలపనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. టీసీఎస్ కంపెనీలో ఈ విధానం అమలైతే మాత్రం ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే కోవలోకి వెళ్లనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…