Featured

చిరంజీవి, మోహన్ బాబు నటించిన ఆ రెండు సినిమాలు అందుకే ఫ్లాపయ్యాయి..!

ఒకే జోనర్ సినిమాలు ఇప్పటికే సౌత్‌లోని భాషలలో అలాగే బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకే పాయింట్‌తో కథ అల్లి సినిమా తీసి హిట్ అందుకున్న దర్శక, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. కథా నేపథ్యం కూడా ఒకటే అయినా స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ వేరేగా రాసుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్న వారు ఉన్నారు. నందమూరి సోదరులు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు ఒకే జోనర్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తారక్ టెంపర్ అనే సినిమా చేశాడు. అదే సమయంలో కళ్యాణ్ రాం కూడా పటాస్ అనే సినిమా చేశాడు.

పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక పూరి స్టార్ డైరెక్టర్. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తమ సినిమాలను రూపొందించారు. ఈ విషయం తెలుసుకొని కళ్యాణ్ రాం పూరి వద్దకి వెళ్ళి సార్ మీరు మేము చేస్తున్న కథ ఒకటే అండి అన్నాడు. దానికి పూరి నవ్వుతూ ఇండస్ట్రీలో వచ్చే సినిమా కథలన్నీ ఒకటే. ఒక్కో దర్శకుడు కథను ఒక్కోలా తీస్తాడు. నేనున్నా కదా..మీరు మీ స్టైల్లో తీయండి అని భరోసా ఇచ్చారు. అలా రెండు వారాల గ్యాప్‌లో ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాతో, కళ్యాణ్ రాం – అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు.

అయితే ఒకే జోనర్‌తో ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా కూడా రెండు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా ఆ సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలే ‘చంటబ్బాయి’, ‘డిటెక్టివ్ నారద’. ‘చంటబ్బాయి’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – సుహాసిని జంటగా నటించారు. జగ్గయ్య కీలక పాత్రలో నటించారు. ప్రముఖ హాస్య చిత్రాల దర్శక దిగ్గజం జంధ్యాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా కథకి మూలం పీటర్ సెల్లర్ రాసిన అ షార్ట్ ఇన్ ది డార్క్ అనే నవల. మంచి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి హీరోయిజం పక్కన పెట్టి జంధ్యాల శైలి సినిమాలో నటించాలని ఉత్సాహంతో ‘చంటబ్బాయి’ చేశారు.

ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. అయితే చిరంజీవి ఇమేజ్, జంధ్యాల ఇమేజ్ ‘చంటబ్బాయి’ సినిమా హిట్ సినిమాగా నిలపలేకపోయాయి. చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో కడుపుబ్బా నవ్వించిన చంటబ్బాయి సినిమా బావుందన్న టాక్ తప్ప కమర్షియల్ హిట్‌గా మాత్రం నిలవలేకపోయింది.

ఇక మంచు మోహన్ బాబు కూడా డిటెక్టివ్ పాత్రలో నటించారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు. 1992 లో వచ్చిన ‘డిటెక్టివ్ నారద’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇది కూడా ఒక స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో కాంబినేషన్‌లో వచ్చిన సినిమా. మ్యూజికల్ గా కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు.

‘డిటెక్టివ్ నారద’ సినిమాలో గుర్తుండే ఒకే ఒక్క పాట ప్రేమ యాత్రలకు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే ఇద్దరు స్టార్ డైరెక్టర్ హీరోల కాంబినేషన్‌లో వచ్చిన డిటెక్టివ్ కథలు ఫ్లాపవడానికి కారణం వాటిని కామెడీ జోనర్‌లో రూపొందించడమే. సీరియస్ గా సాగే కథను హీరో పాత్రలో కామెడీని నింపేసి తెరకెక్కించడం మైనస్ అయిందని అప్పట్లో చెప్పుకున్నారు. మళ్ళీ అటు చిరంజీవి గానీ, ఇటు మోహన్ బాబు గానీ ఈ తరహా కథలలో నటించలేదు. అంతేకాదు దర్శకులు వంశీ – జంధ్యాల కూడా మళ్లీ ఇదే జోనర్‌లో సినిమాలు తీయలేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

7 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

7 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

8 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

8 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

10 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

10 hours ago