80 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వృద్ధుడికి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. డబ్బు ఉన్నదన్న పొగరుతో అతడు ఎవరితోనైనా దురుసుగా మాట్లాడేవాడు. ఓ రోజు ఓ కిరాణా దుకాణానికి వెళ్లి.. నీ భార్యను నాతో పంపు.. రూ. 10 వేలు ఇస్తానని కోరాడు. దీంతో కోపంతో ఆ షాప్ యజమాని అతడిని ఎంచేశాడో తెలుసా.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానికంగా నివాసం ఉండే 80 ఏళ్ల వృద్దుడు శమకాంత్ తుకారమ్ నాయక్.. ఉల్వేలో కోట్లు విలువ చేసే అనేక ఆస్తులను కలిగి ఉన్నాడు. అతడు అక్కడే ఉన్న మోహన చౌదరి (33) అనే వ్యక్తి షాపుకు వెళ్తూ ఉండేవాడు. ఓ రోజు ఇలా అతడి షాప్ కి వెళ్లి నీ భార్యను నాతో పంపు.. రూ.5 వేలు ఇస్తాననంటూ అడిగాడు.. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక మరో రోజు అలానే వెళ్లి ఈ సారి రూ.10 వేలు ఇస్తాను.. నా గౌడాన్ కు నీ భార్యను పంపు అని మళ్లీ కోరాడు. అతడి డిమాండ్ కు విసుగు చెందిన మోహన్ అతడిని వెనక్కి నెట్టాడు. ఆ క్రమంలో శమకాంత్ తుకారమ్ తల ఓ టేబుల్ కొనకు తగలడంతో కింద పడి పోయాడు. వెంటనే ఓ కత్తి తీసుకొని అతడి గొంతు కోసి హత్య చేశడు.
వెంటనే షాప్ మూసేసిన మోహన్ ఆ శవాన్ని దాచి మరుసటి రోజు ఆ శవాన్ని సైకిల్ పై తీసుకెళ్లి ఊరి చివర పడేశాడు. తన తండ్రి కనిపించడం లేదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి శమకాంత్ నాయక్ కొడుకు శేఖర్ నాయక్ వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని గుర్తించి.. మోహన్ ను అరెస్టు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…