టీసీఎస్ ఐటీ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లేనట్లే.. ఎప్పటి నుంచంటే..

0
442

కరోనా మొదలైన దగ్గర నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు ఎంతో మంది ప్రజలు కరోనా కారణంగా మరణించారు. వారిని నమ్ముకున్న ఎంతో మంది కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొంత మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇతర రంగాల్లో పని చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ఆ ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగుల పై పడలేదనే చెప్పాలి.

ఎందుకంటే.. లాక్ డౌన్ సమయంలో కూడా.. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను అనుసరించాయి. అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ కంపెనీలు వెల్లడించాయి.

దీంతో ఇప్పుడు ఆ పనికి స్వస్తి పలకనున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో వర్క్ ఫ్రం హోంకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్ తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరిలోనైనా.. లేదా ఈ సంవత్సరం చివర్లో అయినా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపారు.

మొత్తం 5 లక్షల మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి తెలపనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. టీసీఎస్ కంపెనీలో ఈ విధానం అమలైతే మాత్రం ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే కోవలోకి వెళ్లనున్నారు.