Bigg Boss Telugu 6: బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ విభిన్నమైన టాస్కులను ఇస్తూ వారి మధ్య పెద్ద ఎత్తున పోటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డిని చీకటి గదిలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి క్యాండిల్ తీసుకురావాలని సూచించారు. అయితే చీకటి గదిలో పాములు వింత శబ్దాలు గజ్జల శబ్దాలు రావడంతో ఆదిరెడ్డి భయపడిపోయారు.
ఇలా అడుగు తీసే అడుగు ముందుకు పెట్ట లేకుండా భయంతో వనికి పోతున్నటువంటి ఆదిరెడ్డికి ఎవరైనా సహాయంగా కావాలంటే పంపిస్తామని బిగ్ బాస్ తెలిపారు.దీంతో ఆదిరెడ్డి తనకు శ్రీహాన్ కావాలి అని చెప్పడంతో బిగ్ బాస్ శ్రీహాన్ ను కూడా ఆ చీకటి గదిలోకి పంపించారు. ఇక ఆదిరెడ్డి ఉన్నప్పుడైనా కాస్త అడుగు తీసి అడుగు ముందుకు వేశారు. శ్రీహన్ లోపలికి వెళ్లడంతో శ్రీహాన్ పెద్ద ఎత్తున భయపడుతూ ఆదిరెడ్డిని కూడా భయపెట్టాడు.
శ్రీహన్ లోపలికి వెళ్ళగానే బిగ్ బాస్ క్యాండిల్ తో పాటు గన్ను కూడా వెతికి తీసుకురావాలని చెప్పారు. ఇక ఆ గదిలో పెద్ద ఎత్తున గజ్జల శబ్దాలు, వింత వింత అరుపులు వినిపించడంతో శ్రీహాన్ గట్టిగా కేకలు వేస్తూ భయపడ్డారు. దీంతో అది రెడ్డి శ్రీహాన్ రాకపోయినప్పుడే బాగుండేది బిగ్ బాస్ అంటూ వాళ్ళిద్దరూ క్యాండిల్, గన్ వెతకడం మానేసి భయపడుతూ కూర్చున్నారు.
ఇలా వీరిద్దరూ చీకటి గదిలో భయపడుతున్నటువంటి వీడియోని విడుదల చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ టాస్కులలో పెద్ద తోపులుగా ఇద్దరు కనిపిస్తారు. కానీ మరి ఇంత పిరికి వాళ్ళ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పిన విధంగా ఆదిరెడ్డి శ్రీహన్ క్యాండిల్, గన్ తీసుకువచ్చారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…