Categories: FeaturedGeneral News

Vikarabad: వీడిన వికారాబాద్ మిషన్ మిస్టరీ.. ఆకాశంలో నుంచి ఊడిపడిన ఆ పరికరం ఏంటంటే?

Vikarabad: బాలకృష్ణ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈసినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో టైం మిషన్ లాంటి పరికరం వికారాబాద్లో ఆకాశం నుంచి ఊడిపడి ఒక్కసారిగా అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి అందరికీ తెలిసిందే.

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత పరికరం దాదాపు రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి ఒక్కసారిగా పంట పొలాలలో నేలను తాకింది దీంతో ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనలకు గురయ్యారు ఈ పరికరం చూడటానికి అచ్చం ఆదిత్య 369 సినిమాలో టైం ట్రావెల్ మిషన్ ని తలపించడంతో పెద్ద ఎత్తున ఈ మిషన్ చూడటానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ క్రమంలోనే ఈ మిషన్ ఏంటి అనే విషయం గురించి ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు ఈ మిషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా పంట పొలాలలో ల్యాండ్ అయిన ఈ పరికరం హలో స్పేస్‌ మెషిన్‌ తాలూకా రీసెర్చ్‌ హీలియం బెలూన్‌ అని స్పష్టం చేశారు. స్పెయిన్ మ్యాడ్రిడ్‌లో ఏర్పాటైన సంస్థ.. స్పేస్ టూరిజం కోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని తేల్చారు. 

Vikarabad:రీసెర్చ్‌ హీలియం బెలూన్‌…

బెలూన్‌ ఫెసిలిటీ ఆఫ్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో దీన్ని పంపినట్లు తెలియజేశారు .ఇక ఈ బెలూన్ పంపించడానికి భారత ప్రభుత్వం సహకారం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఐదు రోజులపాటు ఇది స్పేస్ లో ఉండేలా ప్రయోగం జరిగిందని అయితే ఇది ఉన్నఫలంగా నేలను తాకడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని అధికారులు తెలియజేశారు. అయితే ఇది ఒక స్పేస్ పరికరం అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రజలు పొరపాటున ఈ పరికరం ఇళ్లపై లేదా జనాల పైన పడి ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago