Vikarabad: బాలకృష్ణ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈసినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో టైం మిషన్ లాంటి పరికరం వికారాబాద్లో ఆకాశం నుంచి ఊడిపడి ఒక్కసారిగా అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి అందరికీ తెలిసిందే.

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత పరికరం దాదాపు రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి ఒక్కసారిగా పంట పొలాలలో నేలను తాకింది దీంతో ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనలకు గురయ్యారు ఈ పరికరం చూడటానికి అచ్చం ఆదిత్య 369 సినిమాలో టైం ట్రావెల్ మిషన్ ని తలపించడంతో పెద్ద ఎత్తున ఈ మిషన్ చూడటానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ క్రమంలోనే ఈ మిషన్ ఏంటి అనే విషయం గురించి ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు ఈ మిషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా పంట పొలాలలో ల్యాండ్ అయిన ఈ పరికరం హలో స్పేస్ మెషిన్ తాలూకా రీసెర్చ్ హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు. స్పెయిన్ మ్యాడ్రిడ్‌లో ఏర్పాటైన సంస్థ.. స్పేస్ టూరిజం కోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని తేల్చారు.

Vikarabad:రీసెర్చ్ హీలియం బెలూన్…
బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దీన్ని పంపినట్లు తెలియజేశారు .ఇక ఈ బెలూన్ పంపించడానికి భారత ప్రభుత్వం సహకారం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఐదు రోజులపాటు ఇది స్పేస్ లో ఉండేలా ప్రయోగం జరిగిందని అయితే ఇది ఉన్నఫలంగా నేలను తాకడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని అధికారులు తెలియజేశారు. అయితే ఇది ఒక స్పేస్ పరికరం అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రజలు పొరపాటున ఈ పరికరం ఇళ్లపై లేదా జనాల పైన పడి ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

































