Makeup man Madhavarao : కృష్ణ గారి వ్యక్తిగత మేకప్ మాన్ గా ఆయనతో చాలా ఏళ్లుగా పనిచేసిన మాధవరావు గారు కృష్ణ గారితోనే కాకుండా పెద్ద హీరోలకు మేకప్ చేసారు. ఎన్టీఆర్ గారికి, సావిత్రి, వాణిశ్రీ ఇలా చాలా మంది అగ్ర తారలకు మేకప్ చేసిన ఆయన తన అనుభవాలను అప్పటికి ఇప్పటికీ మేకప్ లో వచ్చిన మార్పులను చెప్పారు. ఇక అప్పట్లో విగ్గులను సెట్ చేయాలంటే మాధవరావు ఉండాల్సిందే అనట్లుగా ఉండేది అంటూ చెప్పారు. ఏ హీరో అయిన విగ్గులను బాగా సెట్ చేసేవాడినని పేరు ఉండేది అంటూ చెప్పారు.
జగయ్య గారు చేసిన పని ఎన్టీఆర్ కు నచ్చక….
ఎన్టీఆర్ గారి వ్యక్తిగత మేకప్ మాన్ పీతాంబరం గారు ఉన్న కొన్ని సినిమాలకు మాధవరావు గారు పనిచేశారట. అలా ‘మంచి మనుషులు’ సినిమాకు ఎన్టీఆర్ గారు పనిచేయమని పిలిపించగా జగయ్య గారికి విషయం తెలియక వేరే వ్యక్తిని రెఫర్ చేశారట. అప్పుడు విషయం తెలిసీ మాధవరావు గారు ఎన్టీఆర్ గారికి విషయం చెప్పగా సినిమాలో హీరో మేము బ్రదర్ ఏమి ఆలోచించకండి మీరే మేకప్ చేస్తారు అని చెప్పి వంద రూపాయలు నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి పంపారట.
ఇక ఎంతోమంది మంది హీరోయిన్లకు కూడా మేకప్ చేసిన మాధవరావు గారు ఎవరు కూడా ఇలా చెయ్ అలా చెయ్ అని చెప్పేవారు కాదు వారి ప్రమేయం ఉండేది కాదు మేకప్ వాళ్ళను గౌరవించేవాళ్ళు అంటూ చెప్పారు. సావిత్రి గారికి మేకప్ వేసినపుడు సావిత్రి గారిని చూడటానికి నా భార్య వచ్చింది. అప్పుడు సావిత్రి గారు చాలా ప్రేమగా మాట్లాడించారు అంటూ సావిత్రి గారు చాలా సరదాగా అందరితో ఉంటారు అంటూ పంచుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…