Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ కాంపౌండ్ నుంచి అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు పరిచయమయ్యారు. అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అనంతరం వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు.పెళ్లి తర్వాత నిహారిక వైవాహిక జీవితం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన అత్తింటి వారి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తను తన తల్లిదండ్రుల దగ్గర ఒక రాజకుమారిగా పెరిగాను అయితే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తానే ప్రిన్సెస్ అని ఈమె తెలిపారు.అమ్మ నాన్నల దగ్గర ఎంత అల్లరి చేసే దానీనో అత్తయ్య మామయ్య దగ్గర కూడా అంతే అల్లరిగా ఉంటానని వాళ్లు కూడా నాతో చాలా సరదాగా గడుపుతారని తెలిపారు.
ఇక అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం 10 గంటలకు నిద్ర లేచే దాన్ని అప్పటికీ లేకపోతే అమ్మ వచ్చి డోర్ కొట్టి నన్ను నిద్రలేపేది.అయితే అత్తయ్య వాళ్ళింట్లో కనీసం డోర్ కూడా కొట్టారని నాకు ఇష్టం వచ్చినప్పుడు లేవని నన్ను వదిలేసేవారు అంటూ తెలిపారు. నువ్వు మా చైతన్యను బాగా చూసుకో నిన్ను చూసుకోవడానికి మేమున్నామని చెబుతారు.
ఇక నాకు బాగా ఆకలి వేస్తుంది అంటే అత్తయ్య స్వయంగా అన్నం కలిపి తీసుకొచ్చి తనకు తినిపిస్తారని ఈ విషయంలో మా అత్తయ్య కాళ్లకు మొక్కాలి అంటూ నిహారిక తన అత్తయ్య గురించి మొదటిసారి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొత్తానికి నిహారిక తన తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉందో తన అత్తయ్య మామయ్యల దగ్గర కూడా అలాగే ఉందని అక్కడ తను చాలా సంతోషంగా గడుపుతున్నట్లు ఈమె తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…