నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్ సీజన్-5లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టి.. జనాలను బాగా ఆకట్టుకున్నాడు. ఉన్నది కొద్ది రోజులే అయినా అక్కడ తన ఆటతీరుతో మంచి పాపులారిటీ సంపాదించాడు. అయితే ఎలిమినేషన్ లో బాగంగా తను హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికే పెళ్లైన నటరాజ్ మాస్టర్ కు తాజాగా వారరసురాలు వచ్చింది. ఆయన సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఆట షోలో డ్యాన్సర్ గా అదరగొట్టిన నీతును నటరాజ్ మాస్టర్ వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈదంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. గడిచిన కొంత కాలంగా నీతుకు సంబంధించిన శ్రీమంతం, మెటర్నిటీ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు నటరాజ్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ అంటూ పోస్టు పెట్టాడు. తనకు ఇంత అందమైన బహుమతిని అందించిన తన భార్యకు ధన్యవాదాలు చెప్పాడు. ఈ సందర్భంగా బిడ్డను ఎత్తుకున్న ఫోటోను ఆయన షేర్ చేశాడు. ఈ ఫోటోలో చిన్న పాప కళ్లు తెరిచి చూస్తూ ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నది.
ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించిన పలువురు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. పేరెంట్స్ గా ప్రమోట్ అయిన ఈ దంపతులను ఆశీర్వదిస్తున్నారు. చిన్నారి పాప చక్కటి ఫ్యూచర్ తో ముందుకు సాగాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. అటు నటరాజ్ మాస్టర్ అభిమానులు కూడా అభినందనలు చెప్తున్నారు. అటు పలు టీవీ షోటకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన నటరాజ్ మాస్టర్.. పలు సినిమాలకు కూడా వర్క్ చేశాడు. మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ -5లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ కూడా మంచి ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…