నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక సందేశాత్మక పోస్టులు పెడుతూ తమ అభిమానులకు దగ్గర అవుతోంది. తాజాగా ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకు ఆమె పోస్టు చేసిన దాంట్లో ఏముందంటే.. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను బుధవారం ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే సత్యవతి నిర్ణయాన్ని కేటీఆర్ ప్రశంసిస్తూ.. తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదని.. కేటీఆర్ పోస్టు చేశాడు. అయితే ఇదే పోస్టును సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టి.. ఆ పోస్టుకు దండం పెడుతూ.. చప్పట్లు కొడుతన్న ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తియిపోయింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. ఈ సాంగ్ కోసం సమంత దాదాపు కోటిన్నర పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె చూడని ప్రదేశాలకు కూడా ఈ మధ్యన వెళ్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…