బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్ లలో ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమాదేవి రెండు వారాల పాటు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచి ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ఉమాదేవి కంటెస్టెంట్ సన్నీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈమె సన్నీ గురించి మాట్లాడుతూ ఏకంగా తనని తన అల్లుడిగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఉమా దేవికి ఇద్దరు కూతుర్లు కావడంతో తన పెద్ద కూతురిని సన్నీకి ఇచ్చి పెళ్లి చేయాలని ఉమాదేవి అనుకున్నదట అయితే ఓసారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు తన చిన్న కూతురు సన్నీని అన్నయ్య అని పిలవడంతో తను కూడా తనని చెల్లెలుగా భావిస్తున్నట్లు ఉమాదేవి తెలిపారు.
కానీ తనని మాత్రం అత్తయ్య అని పిలుస్తారని,తన పిల్లలకు ఏ సమస్య వచ్చినా వెంటనే సన్ని ఆదుకుంటాడని ఈ సందర్భంగా ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. సన్నీ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని, కచ్చితంగా సన్నీ టాప్ ఫైవ్ లో ఉంటారని ఉమాదేవి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…