తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా 9 వ వారం ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి 8 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌస్ లో మిగిలి ఉన్నారు. తొలి వారం సరయూ, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదోవారం హమీదా, ఆరోవారం శ్వేతా వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు అందరూ కలిసి ఒకచోట చేరినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి, ప్రియ, శ్వేతా, సరయు, హమీదా,నటరాజ్ మాస్టర్ ఇంట్లో కలిసినట్టు వైరల్ అవుతున్న ఫొటోలని చూస్తుంటే అర్ధమవుతుంది.
వీరిని ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.అయితే కేవలం ఈ సీజన్ మాత్రమే కాదు గతంలో జరిగిన నాలుగు సీజన్ లలో కంటెస్టెంట్లు కూడా స్నేహితులుగా మారి అప్పుడప్పుడు ఒకచోట చేరడం సరదా షికార్లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం లాంటివి చూశాం.
అయితే, ఇప్పుడు ఇంకా సీజన్ పూర్తికాకముందే ఐదవ సీజన్ కంటెస్టెంట్లు ఇలా ఒకే చోట కలవడంతో వీరిమధ్య ఇంకా బాండింగ్ ఉన్నట్లుగా అభిమానులు ఫీలవుతున్నారు.అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండ వచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ గెట్ టూ గెదర్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…