టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ఆచార్య .దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దసరాకి అయినా విడుదల అవుతుంది అనుకుంటే సంక్రాంతికి వాయిదా వేశారు.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు భారీగానే స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను పూర్తిచేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.
ఈ సినిమా సెకండ్ సింగిల్ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీలాంబరి అనే పాటను నవంబర్ 5 వ తేదీన ఉదయం 11.07 నిముషాలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…