Categories: FeaturedMovie News

బిగ్ బాస్‌ సీజన్ 4లో కొత్త హోస్ట్ – నాగార్జున స్థానంలో జేజమ్మ…?!

‘బిగ్ బాస్’ పరిచయం అక్కర్లేని రియాల్టీ షో… ఈ షో తెలుగుతో పాటు అన్ని లోకల్ లాంగ్వేజ్ లలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముందుగా హాలీవుడ్ లో ఆరంభమైన రియాల్టీ షో.. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది.. ‘వాస్తవానికి ఈ షో మనసుషుల్లో ఉండే ఇతర రకాల సైకాలజీని స్టడీ చేసే ఒక ల్యాబరేటరీ’ అంటూ అరవంలో బిగ్ బాస్ షో సీజన్-1ను కమల్ హాసన్ ప్రారంభించే సమయంలో ఓ ప్రొఫెసర్ మాటలను గుర్తు చేశాడు. ఈ బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ ప్రారంభ షో నుండి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే దీనికి ఎందుకని ఇంతలా క్రేజ్ పెరుగుతోంది.. అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్టయ్యింది.

మీడియా ఛానెల్స్, సోషల్ మీడియా వారు దీనిపై ఎందుకంత ఫోకస్ పెడుతున్నారనే విషయాలను పరిశీలిస్తే.. బిగ్ బాస్ రియాల్టీ షో కాన్సెప్ట్ ను నెదర్లాండ్స్ లోని డచ్ మీడియా కంపెనీ ద్వారా వెలుగులోకొచ్చింది. దీన్ని ఆ కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ కనిపెట్టారు. 1999లో మొదటిసారిగా ‘బిగ్ బ్రదర్’ పేరుతో ప్రసారం అయ్యింది. సెలబ్రిటీల పర్సనల్ మ్యాటర్, వేష భాషలు, ప్రవర్తనను దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాల్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సెలబ్రెటీలను మాములుగా ఉన్నప్పుడు చూసే ఛాన్స్ రావడంతో ప్రేక్షకులు ఈ షోని ఎగబడి చూసేశారు. ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుండి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా దేశాలు ఈ షోని మొదలుపెట్టిన వెంటనే ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు టెలివిజన్ కు టీఆర్పీలని ఎక్కువగా తెచ్చేస్తోంది. దీంతో ప్రకటనల వ్యాపారం కోట్లలో జరిగింది. ఆ ప్రాఫిట్స్ లో సెలబ్రెటీలకు ఇచ్చే సొమ్ములు అసలు లెక్కలోకే రావు. అందుకే ఈ షోకు ప్రమోషన్ సైతం అదే స్థాయిలో ఉంటుంది. ఈ బిగ్ బాస్ షో వల్ల కేవలం టివి వాళ్లకు మాత్రమే లాభమనుకుంటే మీరు తప్పులే కాలేసినట్టే.

ఎందుకంటే దీని ఆధారంగా సోషల్ మీడియాలోనూ, టివి, యూట్యూబ్ లలోనూ చాలా వ్యాపారమే జరుగుతుంది. మీమ్స్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పేజీలు, పెయిడ్ ఓటింగ్స్ చాలానే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరంటూ ఇంతవరకూ బెట్టింగులైతే జరగలేదు కానీ.. ముంబైలో 2017 సంవత్సరంలో జరిగిన బిగ్ బాస్ షో విన్నర్ గురించి బెట్టింగులు కూడా బాగానే జరిగాయంట. అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రెటీలను యూట్యూబర్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి మనీ జనరేట్ చేసే కమర్షియల్ ఫార్ములా చుట్టూ జరిగే చిన్న వ్యాపారాలు చాలానే ఉన్నాయి. 2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇండియా నుండి ఓ సెలబ్రెటీగా పాల్గొన్నారు. అందులో ఆమెపై ఇంగ్లీష్ లేడీ చేసిన వివాదాస్పద కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో ఇంగ్లీష్ లేడీపై వ్యతిరేకత, శిల్పాశెట్టి మీద సింపతీ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా శిల్పా నిలిచింది. ఇదిలా ఉంటే మన ఇండియాలో ఈ షో మొదటిసారిగా 2006లో ప్రారంభమైంది. ఆ తర్వాత శిల్పాశెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ ఈ షోలకు హోస్టుగా చేయడంతో దీనిపై క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్లింది. కింగ్ ఆఫ్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పుడిప్పుడే భారీగా ప్రేక్షకుల స్పందనను అందుకుంటోన్న బిగ్ బాస్ సీజన్ 4లో భారీ మార్పు జరగబోతుంది.

అదేమిటంటే.. దీనికి హోస్ట్ వ్యవహరిస్తున్న నాగ్ స్థానంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏంటి షాక్ అయ్యారా.? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. వారానికో సరికొత్త ట్విస్ట్ ఇస్తూ.. బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్త టాస్కులు, లవ్ టాపిక్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు… ఇలా కొత్త కొత్త ప్లాన్లతో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకుల నుండి భారీగా స్పందనను రాబడుతున్న నేపథ్యంలో బిగ్ బాస్‌ షోకు కొత్త హోస్ట్‌ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె మరెవరో కాదు. గత పదేళ్లుగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటివరకూ హోస్ట్‌గా ఉన్న నాగార్జున స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతుందని, బహుశా ఈ శనివారం కానీ.. ఆదివారం కానీ మన బాహుబలి హీరోయిన్ అనుష్క ఈ షోలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తాజా సమాచారం. ఇంతకీ బిగ్ బాస్ షోలో హోస్ట్ మారడం వెనుక అసలు కథ ఏమిటంటే.. అనుష్క ఈమధ్యనే ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో నటించింది. అది అక్టోబర్ 2న అమెజాన్‌లో విడుదల కాబోతుంది.

దీని ప్రమోషన్‌లో భాగంగానే నాగార్జున స్థానంలో అనుష్క హోస్ట్ గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని, రానున్న ఎపిసోడ్‌ను నాగ్ కాకుండా అనుష్క ఓపెన్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతుందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్‌ లేటెస్ట్ షో పై ఆసక్తి పెరిగిపోతోంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా గతంలో అక్కినేని నాగార్జున… తన బర్త్ డే వేడుకల కోసం ఫామిలీ మెంబర్స్ తో కలిసి విదేశాలకు వెళ్లిన టైములో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమె హోస్ట్ గా చేసింది 2 ఎపిసోడ్సే అయినా బుల్లితెర ప్రేక్షకులను రమ్యకృష్ణ ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఆమె హోస్ట్ గా వ్యవహరించిన ఆ 2 ఎపిసోడ్స్‌కు భారీ స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది. ఆదండి సంగతి.. మొత్తానికి నిశ్శబ్దం గా ఎంట్రీ ఇవ్వబోతున్న అనుష్క బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో బుల్లితెరపై మీరే చూడండి..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago