Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత బింబి సార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుని ఈయన సినీ కెరియర్ కు అద్భుతమైన కం బ్యాక్ చెప్పాలి. ఇక ఈ సినిమాని స్వయంగా కళ్యాణ్ రామ్ నిర్మించగా వశిష్ట అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు.
ఇలా డైరెక్టర్ కు ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు. బింబిసారా సీక్వెల్ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బింబిసారా సీక్వెల్ సినిమా నుంచి డైరెక్టర్ వశిష్ట తప్పుకున్నారని సమాచారం. ఈ సినిమా నుంచి ఈయన తప్పుకోవడానికి హీరోతో ఉన్న విభేదాలు కారణమని అందుకే తప్పుకున్నారని ఈయన స్థానంలో మరొక డైరెక్టర్ అనిల్ ఈ సినిమాకు డైరెక్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని డైరెక్టర్ వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేసే పనులలో బిజీగా ఉన్నారని మరో వార్త వైరల్ గా మారింది.
ఈ విధంగా ఈ సినిమా సీక్వెల్ నుంచి డైరెక్టర్ వశిష్ట తప్పుకోవడం పట్ల విభిన్న రకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…