Bimbisara Movie: చాలా సంవత్సరాలు తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా బింబిసార. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ వేడుకను శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ రావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన సాయి రామ్ అనే అభిమాని హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఇక వేదికపై ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సాయిరామ్ కుప్పకూలిపోయారు.
ఈ విధంగా ఆయనకు ఫిట్స్ రావడంతోనే పడిపోయారని భావించిన తోటి అభిమానులు వెంటనే అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయిరామ్ మృతి చెందారు.ఇలా ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ అభిమాని మృతి చెందడంతో చిత్ర బృందం ఈ వార్తపై స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా ఎలాంటి సమయంలోనైనా తన కుటుంబాన్ని ఆదుకుంటామని ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ ఖాతా ద్వారా సాయిరామ్ కు నివాళులు అర్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…