ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయను ఆయుర్వేదంలో కారవేల్లికా అని అంటారు. కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే అది సకల వ్యాధులకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.కాకరకాయ తినటానికి చేదుగా ఉన్నా మన ఆరోగ్యానికి అవసరమైన
ఔషధగుణాలతో పాటు పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్,బీట కేరొటిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.
ఔషధ గుణాలు కలిగిన కాకరకాయను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆహారంలో తీసుకోవచ్చు .లేదా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ కాకర జ్యూస్ తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే అనేక ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది. దీన్ని మరింత రుచిగా తయారు చేసుకోవడానికి కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు, పసుపు వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచితే కాకరకాయ ముక్కల్లో చేదు స్వభావం కొంత తగ్గుతుంది. తర్వాత ముక్కలను వేరు చేసి అందులో తగినన్ని నీళ్లు,రాతి ఉప్పు, నిమ్మరసం వేసుకొని మిక్సీలో మెత్తగా జ్యూస్ తయారు చేసుకుని సేవించవచ్చు.
అలాగే కాకరకాయను ఆపిల్ వంటి పండ్ల రసాలతో కలిపి జ్యూస్ తయారు చేసుకున్న మంచి రుచిగాను, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా కాకరకాయను చిన్న ముక్కలుగా కోసి 30 నిమిషాల పాటు చల్లని నీటిలో ఉంచుకోవాలి. తర్వాత ఈ ముక్కలకు ఒక స్పూను ఉప్పు, నిమ్మరసం కలిపి మిక్సీలో మెత్తగా జ్యూస్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని యాపిల్ జ్యూస్ లేదా ఇతర పండ్ల రసంతో కలిపి తీసుకుంటే రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా దక్కుతుంది.
ఇలా ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ సేవించడం వల్ల కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము శరీరంలోని ఇన్‌సులిన్‌ను నియంత్రించి చక్కెరవ్యాధిని అదుపులో ఉంచుతుంది. అలాగే కాకరలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి
ఊబకాయం, బిపి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…