కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్.లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి వారి స్థానాలకు చేర్చాడు. అయితే సోను సూద్ సినిమాలలో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ..సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ ఇప్పటికీ సోనూసూద్ సహాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్రవేసుకున్నాడు.
అయితే వేలాదిమంది దేవుడిగా పూజిస్తున్న సోనూసూద్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటూ అతనిపై కక్షపూరితంగా ఐటి, ఈడి దాడులు జరిపించారు. సోను సూద్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మరింత ఉధృతం చేసింది. ముంబైలోని సోనుసూద్ నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశాయి.వాటికీ సోనూ సూద్ భయపడ్డానని కూడా తెలిపారు.
ప్రస్తుతం సోనూసూద్ పై ఐటీ శాఖ చేస్తున్న దాడులకు రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉంటే తాజాగా సోనూసూద్ కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరొకసారి షాకిచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని హోటల్ గా మార్చారని సోనూసూద్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆరు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణంకాగా. దానిని హోటల్ గా మార్చారని.. దానిని తిరిగి ఇంటికి పునరుద్ధరించాలని నవంబర్ 15న నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ కుస్ములు సోను సూద్ బిఎంసికు కంప్లైంట్ చేశారు. రెసిడెన్షియల్ భవనాన్ని బాలికల వసతి గృహంగా మార్చారని దానిని హోటల్ గా మార్చారని.. ఇది ఇల్లీగల్ నిర్మాణం అంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఆ బిల్డింగ్ ను కూల్చేయాలని కోరారు. తాజాగా బిఎంసి పంపిన నోటీసులో భవనంలోని ఒకటి నుంచి ఆరు అంతస్తులలో మీరు వసతి బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపి వేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…