తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇప్పటివరకు ఈ కార్యక్రమం నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని ఐదవ సీజన్ కూడా పూర్తి కావచ్చింది. ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో ఎక్కువగా నటీనటులు యాంకర్లు యూట్యూబర్స్ సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మోడల్స్ పాల్గొనడం చాలా అరుదు.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో మోడల్ జశ్వంత్ ఎంట్రీ ఇచ్చారు. ఎంతో అద్భుతంగా టాస్క్ లో పాల్గొంటూ ఉన్నటువంటి జస్వంత్ అనారోగ్యకారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావాల్సివచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జశ్వంత్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అసలు జెస్సికి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చారా లేకపోతే తనే డబ్బులు ఇచ్చి అవకాశం అందుకున్నారా అంటూ పలువురు పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాజాగా జెస్సీ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జస్వంత్ మాట్లాడుతూ బయట ఉన్న వాళ్ళు మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు కూడా నా గురించి ఇలాగే అనుకున్నారు. అయితే నా అకౌంట్ లో కేవలం పదకొండు వేలు మాత్రమే ఉన్నాయి.నేను బాగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఉద్యోగం చేస్తూ మోడలింగ్ నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాను.
బిగ్ బాస్ అవకాశం కోసం దొడ్డి దారులను ఎంచుకోకుండా స్ట్రైట్ గా వెళ్లాను,అలాగే ఆడాను అందుకే నాకు బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ వారికి ఎదురు డబ్బులు ఇచ్చి వెళ్లే అంత స్థోమత నాకు లేదని ఈ సందర్భంగా తన గురించి వస్తున్న పుకార్లపై మోడల్ క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…