బిగ్ బాస్ షో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మరికొన్ని రోజులలో బిగ్ బాస్ షో ముగియనుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు మాత్రమే కంటెస్టెంట్ లు మిగిలారు. టాప్ ఫైవ్ లో ఉండాలి అని కంటెస్టెంట్ లు నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కాజల్ కు మరీ ఎక్కువ అటాచ్ కావద్దు అంటూ సిరికు సలహా ఇచ్చాడు షణ్మఖ్.
ఆ తర్వాత కాజల్, సన్నీకి దిష్టి తీయగా, షణ్ముఖ్ కు సిరి దిష్టి తీసింది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీనితో ప్రియాంక వెళ్లిపోయిన బాధలో మానస్ ఒంటరిగా కూర్చున్నాడు.అప్పుడు కాజల్, సన్నీ వెళ్ళి మానస్ ని ఏడిపించారు. ప్రియాంక కోసం మానస్ పాడిన పాటను పాడుతూ అతని టీజ్ చేసారు.
మాది ఫ్రెండ్షిప్ రా లవ్ కాదురా అని మానస్ ఎంత మొత్తుకున్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఆ తరువాత మానస్, కాజల్..సన్నీ, సిరికి లింకు పెడుతూ.. సిరి కనపడగానే నీ ఆలియాభట్ వస్తుంది అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై షణ్ముఖ్ జస్వంత్ సీరియస్ అయ్యాడు. సిరి పై అసహనం వ్యక్తం చేశాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్త పడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అంటూ సిరిని హెచ్చరించారు షణ్ముఖ్.
అప్పుడు సిరి వాళ్ళు సరదాగా అన్నారులే అంటూ లైట్ తీసుకోవడంతో షణ్ముక్ మళ్లీ చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు అంటూ విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనితో సిరి ఏడ్చేసింది. బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో ఎవరు టాప్ ఫైవ్ లో నిలుస్తారు, అలాగే బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…