బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాదాపుగా 44 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయి మనందరికీ తెలిసిందే.
ఈ అంచనాలకు అనుగుణంగానే బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో, అలాగే హిందూ దేవాలయాల గురించి చెప్పినప్పుడు ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి.ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో కనిపించారు. ఒక పాత్రలో మురళీకృష్ణగా, రెండవ పాత్రలో అఘోరాగా కనిపించారు.
ఇందులో ఫస్ట్ హాఫ్ లో కనిపించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెండు పాటల వరకే పరిమితం అయినప్పటికీ, బాలయ్య ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ గా ప్రగ్యాని ఎంపిక చేసుకున్నాడు బోయపాటి. ఇందులో మురళీకృష్ణ భార్యగా, కలెక్టర్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించడానికంటే ముందు బోయపాటి కొంతమంది హీరోయిన్ లను సంప్రదించారట, చివరికి ప్రగ్యా జైస్వాల్ ను ఫైనల్ చేశాడట.
ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్, ఆ తరువాత రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్, కేథరిన్ లాంటి హీరోయిన్ లను సంప్రదించాడట బోయపాటి. కానీ బోయపాటి మొదట సంప్రదించిన హీరోయిన్ లు అందరూ పలు కారణాలు చెప్పి రిజెక్ట్ చేయడంతో, ఫైనల్ గా ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట బోయపాటి. ఇక ఈ సినిమా ద్వారా ప్రగ్యా జైస్వాల్ మంచి విజయాన్ని అందుకుంది.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…