బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంక ఈ షోలో కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎందరో సినీ తారల పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న3 కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ముందు నుండి వినిపించిన సెలబ్రిటీ పేరు అరియానా గ్లోరీ.
అరియానా గ్లోరీ అసలు పేరు అది కాదు అని ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో నాగార్జున తెలియజేశాడు. తన అసలు పేరు చెప్పడానికి భయపడతాను అని అరియానా గ్లోరీ చెప్పారు. ఇంతకీ అరియానా గ్లోరీ అసలు పేరు ఏమిటంటే.. అర్చన. జనవరి 25వ తేదీన పుట్టిన అరియానా గ్లోరీ వికారాబాద్ లోని తాండూర్ లో పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో యాంకరింగ్ గా ఛాన్స్ ల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టింది. 2015 లో స్టూడియో వన్ ఛానల్ లో యాంకర్ గా చేరిన అరియానా గ్లోరీ.. ఆ తర్వాత ఈ టీవీ అభిరుచిలో కూడా యాంకర్ గా చేసింది.
2017 నుండి జెమినీ కామెడీలో యాంకర్ గా కంటిన్యూ అవుతుంది అరియానా గ్లోరీ. టీవీ ఛానల్స్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తున్న అరియానా గ్లోరీ. రాంగోపాల్ వర్మతో తను చేసిన ఇంటర్వ్యూ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్నది. ఈవిధంగా ఇప్పటివరకూ దాదాపు 500 సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసింది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అరియానా గ్లోరీ ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…