ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (98) అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ముంబై లోని హిందూజ హాస్పిటల్ కు తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. గత కొద్ది రోజులుగా దిలీప్ కుమార్ శ్వాస సంబందిత వ్యాదితో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా బాను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు.
గత నెలలో కూడా ఆయన సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. గతేడాది కరోనా మహమ్మారి ధాటికి అయన ఇద్దరు సోదరులు అస్లాంఖాన్ (88) ఎషాన్ ఖాన్ (90) మరణించారు. 1944లో ‘జ్వార్ భాటా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత వరుస విజయాలతో స్టార్ డం సంపాదించారు. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…