బాలీవుడ్ ధోనీ బయోపిక్ లో నటించి ఎంతో క్రేజ్. సంపాదించుకున్న యువ నటుడు సుశాంత్ బలవన్మరణం వెనుక ఊహించని విషయాలెన్నో బయట పడుతున్నాయి. సుశాంత్ కి అవకాశాలు రాకుండా అనేక మంది కీలక నిర్మాతలు పావులు కదిపారని విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎంక్వయిరీలో బాలీవుడ్ పెద్దల భాగోతాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలెక్కువగా కనబడుతున్నాయి. సుశాంత్ సూసైడ్ విషయంలో పలువురిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో గత కొద్దికాలంగా సహ జీవనం చేశాడని గాసిప్స్ వచ్చాయి. సుశాంత్ సింగ్ రియా కలిసి జిమ్ నుండి బయటకొచ్చిన ఫోటో కూడా సోషల్ మీడియాలో భారీగానే సంచలనం సృష్టిస్తుంది. దీంతో నెటిజన్లు కూడా రియా కోసం తెగ కామెంట్స్ పెడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్య కు సంబంధించి ఎంక్వయిరీలో భాగంగా రియా చక్రవర్తిని త్వరలోనే ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు. సుశాంత్ తో ఆమెకున్న అనుబంధం ఎలాంటిదో.. సుశాంత్ గత కొద్ది నెలలుగా ఎలా ఉండేవాడో తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సుశాంత్ గత కొద్ది నెలలుగా ఓ డాక్టర్ ను సంప్రదిస్తూ వస్తున్నాడని అతన్ని కూడా విచారించనున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ కు దగ్గరి వ్యక్తులతో కూడా పోలీసులు మాట్లాడనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…