సాధారణంగా ఎంతోమంది బడా వ్యాపార వేత్తలను మంచి డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ వారిని హనీట్రాప్ లోకి దింపుతూ వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు లాగుతూ తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వ్యవహారంలో ఎంతో మంది పట్టుబడ్డారు. తాజాగా ఒక బాలీవుడ్ నటి కూడా ఈ విధంగా హనీట్రాప్ చేస్తూ ఎంతోమంది బడా వ్యాపారవేత్తలను ఫోటోలు వీడియోల ద్వారా బెదిరించి డబ్బును పోగు చేస్తోందని పోలీసులకు తెలియడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు.
ఈ క్రమంలోనే పోలీసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 90 కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన స్వప్న అలియాస్ Lubna Wazir. ఈమె 2016 వ సంవత్సరం నుంచి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఎన్నో అక్రమాలకు పాల్పడింది. ఈ హనీ ట్రాపింగ్ లో ఈ నటికి ఇద్దరు లేడీ మోడల్స్, ఒక మగ మోడల్ సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్లాన్ ప్రకారం వ్యాపారవేత్తలతో బిజినెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలి అంటూ వారిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి రప్పిస్తారు. వారితో లేడీ మోడల్స్ మాట్లాడుతూ కొంత సమయానికి ఒక ఆమె బయటకు వెళితే మరొక ఆమె వాష్ రూమ్ కి వెళ్లి నగ్నంగా బయటకు వస్తుంది. అదే సమయంలోనే ఒక మగ మోడల్ రూమ్ డోర్ కొట్టగా నగ్నంగా ఉన్న మహిళ తలుపుతీసి ఆ వ్యాపారవేత్త తనపై అత్యాచారానికి పాల్పడినట్లు నటిస్తుంది.
ఈ క్రమంలోనే అతను ఫోటోలు వీడియోలు తీసి ఆ వ్యాపారవేత్తను బెదిరిస్తూ లక్షలకు లక్షలు డబ్బులు తీసుకోవడం చేస్తున్నారు.ఈ క్రమంలోనే చాలామంది వ్యాపారవేత్తలు ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే వీరి టార్చర్ భరించలేక ఒక వ్యాపారవేత్త జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేసి తన ఇంటిని సోదా చేశారు.ఈ క్రమంలోనే విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని మిగిలిన ఆ ముగ్గురు మోడల్స్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…