టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కొంత కాలం విరామం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో మెగాస్టార్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ మరొక చిత్రంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉండగా తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ మరో రీమేక్ చిత్రాన్ని చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకీ కుడుముల మెగాస్టార్ కి కథ చెప్పగా అందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని వచ్చే ఏడాది చివరిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన రష్మిక సందడి చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ కూతురు వయసు ఉన్న అమ్మాయితో సినిమా తీయడం ఏంటి అంటూ కామెంట్ చేయగా మరికొందరు రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారా లేక కూతురిగానా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎక్కడ అధికారికంగా ప్రకటించక ముందే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…