బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరికొన్ని వారాలలో ముగుస్తుందని తెలుస్తోంది. ఇకపోతే 11వ వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్నటువంటి ఎనిమిది మందిలో అనీ మాస్టర్ బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఈమె గత రెండు వారాల నుంచి వింతగా ప్రవర్తించడం ఆమె వింత ప్రవర్తన కారణం వల్లనే ప్రేక్షకులు విసుగుచెంది తనకు ఓట్లు తక్కువగా వేశారని ఆ కారణం వల్లే ఈమె ఎలిమినేట్ అయ్యారు అంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
అనీ మాస్టర్ వృత్తిపరంగా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమెకు బయట ఎంతో మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలోని వీరి డిమాండ్ ను బట్టి బిగ్ బాస్ వారికి రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అనీ మాస్టర్ కి వారానికి బిగ్ బాస్ నిర్వాహకులు 3.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 11 వారాలు ఈమె హౌస్ లో సందడి చేసినందుకుగాను అనీ మాస్టర్ కి బిగ్ బాస్ 38.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఈమెకు మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…