జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైపర్ ఆది స్కిట్ లో భాగంగా కామెడీ పండించే వారిలో రైజింగ్ రాజు ఒకరు. ఈ క్రమంలోనే హైపర్ ఆది రైజింగ్ రాజు స్కిట్ లను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి.
ఇదిలా ఉండగా కరోనా సమయంలో రైజింగ్ రాజు ఒక ఆరు నెలల సమయం పాటు జబర్దస్త్ వేదికపై మాయమయ్యారు. ఈ క్రమంలోనే చాలామంది రైజింగ్ రాజు కనిపించడం లేదంటూ సందేహాలను వ్యక్తం చేశారు. మరికొందరైతే అతను జబర్దస్త్ మానేశాడని భావించారు. రైజింగ్ రాజు లేకున్నప్పటికీ ఆది స్కిట్ లో పంచ్ మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా తాజాగా రైజింగ్ రాజు మరోసారి ఆది స్కిట్ లలో సందడి చేస్తూ కనిపించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రైజింగ్ రాజు టీం లేకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తాజాగా రైజింగ్ రాజు బయటపెట్టారు. తాను జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి కారణం ఉందని తెలిపారు. ఆ సమయంలో తనకు మనవరాలు పుట్టడం వల్ల నేను బయటకు వస్తే తనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించి ఆరునెలలపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నానని తెలిపారు.
అలా నేను ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ప్రతినెల నాకు రావాల్సిన పేమెంట్స్ ఆది పంపించేవారని ఈ సందర్భంగా ఆది వ్యక్తిత్వం గురించి రైజింగ్ రాజు తెలిపారు . నేను స్కిట్ లలో చేసినా చేయకపోయినా నాకు డబ్బు పంపి నన్ను ఆదుకున్నారని ఆది తన దృష్టిలో ఒక దేవుడంటూ ఆది గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం రైజింగ్ రాజు ఆది గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…