Featured

Bollywood Flop Stars : ప్లాపులతో రికార్డులు బద్దలు కొట్టిన బాలీవుడ్ యాక్టర్స్ ఎవరో తెలుసా…!

Bollywood Flop Stars : సినిమా రంగంలో నెపోటిజం గురించి అందరూ చర్చిచుకుంటూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో అటువంటి నెపో కిడ్స్ గురించి ట్రోల్స్ కూడా ఎక్కువైయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా నెపోటిజం అన్నిచోట్లా ఉంది. అయితే సౌత్ ఇండస్ట్రీ లో నెపోటిజం ఉన్నా స్వతహాగా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు టాలెంట్ తో హిట్లు కొట్టి స్టార్స్ అవుతున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం మహా వృక్షలాగా పేరుకుపోయిన సినిమా పెద్దలు చిన్న మొక్కలను రానివ్వడం లేదు. ఆల్రడీ సుశాంత్ లాంటి వర్ధమాన టాలెంటెడ్ యాక్టర్ కథ మనకు తెలిసినదే. అయితే ఏమాత్రం టాలెంటె లేకపోయినా జనాల మీదకు సినిమా దండయాత్ర చేస్తూ ప్లాపులను మూటగట్టుకుంటున్న కొంత మంది బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. ప్లాప్ స్టార్ అనే బిరుదు కోసం పోటీ పడుతున్న ఆ స్టార్స్ కిడ్స్ ఎవరంటే….

వరుస ప్లాపులతో దండయాత్ర….

సినిమాలను తీస్తున్న ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేని హీరో అంటే మొదటగా గుర్తొచ్చేది అమీర్ ఖాన్ మేనల్లుడుగా ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ లక్, ఒన్స్ అపాన్ ఏ టైం ముంబై దొబరా, వంటి సినిమాలు సైతం ప్లాపే. దెబ్బకి ఇమ్రాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీ ని వదిలేసాడు. ఇక నేను ప్లాప్స్ తో పోటీ పడతాను అంటున్న మరో నెపో స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ఈయన నటించిన సినిమాల ద్వారా మంచి గుర్తింపైతే తెచ్చుకున్నాడు కానీ అది మంచి నటుడుగా మాత్రం కాదు అసలు నటనే బాగోదు, ఎక్స్ప్రెషన్స్ పెట్టడం రాదు అని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కపూర్ ఫ్యామిలీ నుండి హీరోయిన్ అవ్వాలని వచ్చిన సోనమ్ కపూర్ మొదటి సినిమానే సంజయ్ లీలా భన్సాలి సినిమాతో వచ్చిన ప్లాప్స్ తో రికార్డు కొట్టింది. ఇక చేసేదేమి లేక పెళ్లి చేసేసేకుంది. ఇక కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో ఆణిముత్యం అర్జున్ కపూర్. నాన్న బోని కపూర్ పెద్ద ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ కానీ అబ్బాయికి మాత్రం యాక్టింగ్ అబ్బలేదు.

ప్రతి సినిమా ప్లాపే కాకపోతే బడా నిర్మాత కొడుకు కాబట్టి ఇప్పటికీ సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అని టాక్. ఇక అలా నెపో కిడ్ గా ఇండస్ట్రీ కి వచ్చి ప్లాప్స్ తో దుమ్ము లేపిన మరో స్టార్ ఉదయ్ చోప్రా. ధూమ్ సిరీస్ తో అలీ గా కొంచం గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ చోప్రా దర్శకుడు యష్ చోప్రా కొడుకు. ఆ సినిమా తప్పితే ఉదయ్ చోప్రా కు చెప్పుకోడానికి హిట్ సినిమా లేదు. ఇక ప్లాప్స్ తో రికార్డ్స్ కొట్టిన వాళ్లలో జాకి భజ్ఞాని, తూషర్ కపూర్ లాంటివారు ఉన్నారు. వీళ్ళకు టాలెంట్ లేకపోయిన నెపోటిజం వల్ల అవకాశాలను అందుకున్న సద్వినియోగం చేసుకోలేక పోయారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

23 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

23 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

23 hours ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

23 hours ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago