Upasana: మెగా కోడలు ఉపాసన మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె డెలివరీ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉపాసన డెలివరీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అమెరికాలో డెలివరీ కాబోతున్నారనీ వార్తలు హల్చల్ చేశాయి. అదే విధంగా అమెరికాకు చెందిన ఫేమస్ గైనకాలజిస్ట్ ఉపాసనకు డెలివరీ చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని రామ్ చరణ్ కోరిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉపాసన అమెరికాలో డెలివరీ కాబోతుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఉపాసన ఇండియాలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ కు చైర్ పర్సన్ అనే విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఇండియాలో సొంత హాస్పిటల్స్ పెట్టుకున్నటువంటి ఉపాసన డెలివరీ కోసం అమెరికా వెళ్లడం ఏంటి అంటూ పలువురు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తన డెలివరీ గురించి ఉపాసన పలు విషయాలను తెలియజేశారు.
అమెరికన్ ఫేమస్ డాక్టర్ మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఈ వ్యాఖ్యల పై ఇటీవల ఉపాసన స్పందించి తన డెలివరీ వివరాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మిమ్మల్ని కలవడానికి నేను ఎదురు చూస్తున్నా. మా ఫస్ట్ బేబీని డెలివరీ చేయడానికి మీరు అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వచ్చుగా’ అంటూ రిక్వెస్ట్ చేశారు.
ఇలా ఈమె తన బేబీని డెలివరీ చేయడానికి అపోలో హాస్పిటల్లో అమెరికన్ డాక్టర్ ను జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో అందుకు అమెరికన్ గైనకాలజిస్ట్ సైతం తనకు అంగీకారమే అంటూ రిప్లై ఇచ్చారు. ఇక అమెరికన్ గైనకాలజిస్ట్ తో పాటు ఉపాసనకు డెలివరీ చేయడానికి అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుమన మరియు రూమా కూడా డెలివరీ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…