బాలీవుడ్ లో ఎప్పుడు ఏ వివాదం ఎలా మొదలవుతుందో ఊహించని పరిస్థితులు ఇప్పుడెక్కువై పోయాయనడానికి ఉదాహరణగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ల వివాదాన్నే చెప్పవచ్చు. గతేడాది నుండి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదన్న సంగతి తెలిసిందే.! అయితే ఈమధ్యనే బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సుశాంత్ మరణం విషయాన్ని ప్రస్తావిస్తూ.. నేపోటిజం గురించి మాట్లాడిన కంగనా హృతిక్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సారి కంగనా హాట్ హాట్ గా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ పేరును ప్రస్తావిస్తూ కామెంట్స్ చేయడంతో ఇప్పుడదే హాట్ టాపిక్ గా మారింది. మరి మన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, హృతిక్ రోషన్‌ను ఎందుకు టార్గెట్ చేసింది, ఆ వివరాలేంటన్నది తెలియాలంటే చదవండి….
బాలీవుడ్ లో నెపోయిజం అనే అంశంపై ఈమధ్యనే ఓ టివీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “ఒకప్పుడు తాను ‘డబ్బు, అత్యాశ’ లాంటి ట్యాగ్ లైన్లను విన్నానని, కానీ ఇప్పుడు తనకు ముంబైలో సొంత ఇల్లు, విలాసవంతమైన ఆఫీసు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపిన కంగనా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ నేటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని, ఆ ఇంటద్దెను అతని తండ్రి రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడని విమర్శించింది.
‘బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన క్రొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నటిగా నన్ను నేను ఫ్రూఫ్ చేసుకున్న తర్వాత నా జర్నీ హ్యాపీగానే కొనసాగుతుంది. కానీ ఎంత హ్యాపీగా ఉన్నా గతంలో జరిగిన చేదు జ్ణాపకాలెప్పుడూ నన్ను వెంటాడుతూనే వుంది. గతంలో హృతిక్ రోషన్ కూ, నాకూ మధ్య ఓ ఘర్షణ జరిగింది. సమాజ హితం కోసం నేను న్యాయపోరాటం చేస్తే కేవలం డబ్బులు కోసం చేస్తున్నానని వక్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు నేను నా సొంతింట్లో ఉంటున్నాను. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. పాపం.. హృతిక్ ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. అతడి తండ్రియే అద్దె చెల్లిస్తున్నాడు. నేను డబ్బు కోసం పాకులాడటం లేదని చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలనుకుంటాను’ అంటూ చెప్పి ఇంటర్వ్యూను ముగించింది కంగనా. అంతా బాగానే వుంది కానీ.. మనలో మనమాట కంగనా నిజంగానే డబ్బు కోసం ప్రాకులాడకపోతే ఇంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే స్ధాయికి ఇంత తక్కువకాలంలో ఎలా వచ్చిందో.. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…