సాధారణంగా భోజనప్రియులు వారి ఆహార విషయంలో ఎంతో నిబద్ధతగా ఉంటారు.ముఖ్యంగా ఇలాంటి వారు ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళిన లేదా రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న వారి ఫుడ్ విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వారు ఆర్డర్ చేసుకున్న ఆహారంలో ఏ మాత్రం లోపం ఉన్న సదరు రెస్టారెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి తను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగా రాలేదని ఏకంగా రెస్టారెంట్ పై దాడి చేస్తానని బెదిరించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో నివసిస్తున్న అటువంటి 42 ఏళ్ల రోబర్ట్ గాల్విట్జెర్ జూనియర్ ఇటీవల అంకెనేలోని ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ఫోన్ చేసి తనకు ఎంతో ఇష్టమైన చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేసుకున్నారు. తను ఆర్డర్ చేసిన కొంత సమయానికి ఫుడ్ డెలివరీ అయింది. అయితే సదరు సంస్థ అతనికి చికెన్ నగ్గెట్స్ అయితే పంపింది కానీ అందులోకి సాస్ మాత్రం పంపించలేదు. దీంతో దీంతో ఆగ్రహం చెందిన రోబర్ట్ సదరు రెస్టారెంట్ నెంబర్ కు ఫోన్ చేసి చెడామడా తిట్టాడు. అదేవిధంగా తమ రెస్టారెంట్ పై బాంబు దాడి చేస్తానని బెదిరించాడు.
ఈ విధంగా సదరు కస్టమర్ హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి బెదిరించడంతో రెస్టారెంట్ నిర్వాహకులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కలుగజేసుకొని అదే నెంబర్ కి కాల్ చేసి రెస్టారెంట్ పై బాంబు బెదిరింపు గురించి అడగడంతో రోబర్ట్ నిజాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. అనంతరం పూచీకత్తుపై అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…