సదా – ‘జయం’ సినిమాలో ‘వెళ్లవయ్యా.. వెళ్లు వెళ్లు..’ అనే ఒకే ఒక్కడైలాగ్ సదాకి స్టార్ డం తీసుకొచ్చింది. నేటికీ సదాని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఈ డైలాగ్ మహత్యమేనని చెప్పవచ్చు. ఆ తరువాత ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయారు సదా.. తెలుగు తో పాటూ తమిళ్, కన్నడ బాషలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. అయితే మొదట్లో ఎంత ఫాస్ట్ గా స్టార్ డం అందుకుందో అంతే త్వరగానే ఆమె కెరీర్ డౌన్ అయ్యింది. వరుస పరాజయాలతో ఫెడ్ ఔట్ అయిపోయారు సదా. తాజాగా ఈటీవీలోని ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం కి వచ్చిన సదా ఆమె జీవితంలో జరిగిన పలు ఆశక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సమయంలో డైరెక్టర్ తేజతో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. షూటింగ్ లో ఆయన తీసే సీన్స్ అన్నీ చాలా నాచురల్ గా ఉండేటట్టు ప్లాన్ చేస్తారట దర్శకుడు తేజ. అయితే జయం సినిమాలో ఓక సీన్ రియలేస్టిక్ గా రావడంకోసం గోడమీద నుంచి దూకించారని చెప్పింది సదా. జయం సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం ఒక గోడపై నుంచి దూకాలి. ఇంతకీ ఆ సీన్ ఉన్నదన్న విషయం ముందు డైరెక్టర్ తేజ చెప్పలేదట. తీరా ఆ సీన్ షూటింగ్ చేసే సమయంలో తనను గోడమీద నుంచి దూకమని చెప్పారట.
అయితే ఆ సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మా..నాన్నల వైపు చూసిందట. నాన్న వద్దని చెప్పారట. అయితే అప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం ఏం పర్లేదు దూకేయ్ నీకేం కాదు అని చెప్పిందట. అమ్మ చెప్పిన మాటతో ధైర్యం తెచ్చుకుని గోడ పైనుంచి దూకేసిందట. ఆ సీన్ బాగా వచ్చిందని కానీ ఆ సమయంలో తనకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చింది. అలానే మరో సినిమా ‘ఔనన్నా కాదన్న’ చిత్రం షూటింగ్ లో కూడా చావు అంచులవరకు వెళ్ళి వచ్చిందట సదా.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…