Borugadda Anil Kumar : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి టీడీపీ లోకి జంప్ అయ్యారు. ఇక జగన్ ను వారి ఎమ్మెల్యే తో విమర్శిస్తే వైసీపీ నాయకులు ఊరుకుంటారా.. వైసీపీ చిన్న చిన్న లీడర్లు కూడా ఘాటు వాఖ్యలతో రెచ్చిపోయారు. అలా నెల్లూరు రాజకీయం గుంటూరు వరకు వెళ్ళింది. గుంటూరు జిల్లా రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కోటం రెడ్డి కు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇవ్వడంతో ఆరోజు రాత్రికే అతని ఆఫీస్ బిల్డింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక ఈవిషయాల మీద బోరుగడ్డ అనిల్ కుమార్ యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా మాట్లాడారు.
నెల్లూరు రోడ్డులో వేలాడదీస్తా…
మాజీ మంత్రి నక్క ఆనందబాబు అనుచరులతో కలిసి కోటంరెడ్డి తన మనుషులను పంపి తన ఆఫీస్ మీద రాత్రి ఒంటి గంట సమయంలో నిప్పు పెట్టారని అనిల్ కుమార్ ఆరోపించారు. రత్నం బాబు తదితరులు ఈ ఘటనలు ఉన్నారని నా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. అనిల్ కుమార్ వైసీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుండడం వల్ల తన ఆఫీస్ మీద తానే దాడి చేయించుకుని వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అనే విమర్శలకు సమాధానం చెబుతూ బూతులతో రెచ్చిపోయాడు అనిల్ కుమార్. పదవులను ఆశించి చేయలేదని నా ఆఫీస్ కి నేనే నిప్పు ఎందుకు పెట్టుకుంటాను అంటూ ఘాటుగా స్పందించాడు.
కోటంరెడ్డి మీద చేసిన వాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నెల్లూరు రోడ్డు మీద బండితో లాక్కుని వెళ్లి చర్చి దగ్గర వేలాడదీస్తా అంటూ ఫైర్ అయ్యారు. జగన్ కోసం ప్రాణలైనా ఇస్తామని అలాంటిది జగన్ గురించి మంత్రుల గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాడంటూ మాట్లాడాడు అనిల్ కుమార్. కోటంరెడ్డి నిద్రపోతున్న సింహాన్ని లేపాడంటూ ఇప్పుడు నా ఆఫీస్ ను తగలబెట్టిన దానికి వంద రెట్లు బాధపడేలా చేస్తాను, ఒక దళితుడితో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను అంటూ ఫైర్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…