Featured

Singer B. Vasantha : కుటుంబాన్ని పోషించడానికి… భర్త ఎవరంటే… థమన్ కి ఫోన్ చేస్తే ఎత్తడు… ఇంటికి రాడు… ఆ పాట పాడితే ఎంత ఇచ్చాడంటే… : సింగర్ బి. వసంత

Singer B. vasantha : బొడ్డుపల్లి బాల వసంత అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ బి.వసంత అనగానే సింగర్ గా ఆమె పాడిన అలనాటి పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ తెలుగు లోగిల్లలో వినిపిస్తుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఇలా సుమారు 8 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలు పాడిన వసంత గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ అప్పటి రోజుల్లో ఎలా రిలేషన్స్ ఉండేవి లాంటి విషయాలను తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ఒక ఊపు ఊపుతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వసంత గారి సొంత చెల్లి కొడుకు కావడం విశేషం.

బాధ్యతలన్నీ నా మీదే… కుటుంబాన్ని పోషించడానికి…

వసంత గారి స్వస్థలం గుంటూరు కాగా తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ అలానే ఫోటో గ్రాఫర్, ఇక తల్లి వీణ విధ్వంసురాలు కావడం వల్ల వసంత గారికి సంగీతం, గానం మీద చిన్నపటినుండే ఆసక్తి వచ్చింది. ఇక సంగీతం నేర్చుకున్న వసంత గారు తండ్రి ప్రోత్సాహంతో చెన్నైలో సినిమాల్లో పాడటానికి వెళ్లారు. ఇక సింగర్ గా సినిమాల్లోను అలానే బయట కచేరిల్లో పడుతూ కుటుంబ బాధ్యత వసంత గారు తీసుకున్నారు. వసంత గారు ఇద్దరు చెల్లెళ్లను చదివించి పెళ్లి చేసాక తాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక పాటల కచేరి ప్రోగ్రామ్ లో వసంత గారిని చూసి ఇష్టపడిన సుధాకర్ గారు పెళ్లి ప్రపోసల్ పెట్టారట. బంధువే అవడంతో వసంత గారి తండ్రి పెళ్లి చేసారు. భర్త సుధాకర్ గారు వ్యాపారం చేస్తున్నా వసంత గారి కెరీర్ కోసం హైదరాబాద్ లో వ్యాపారాలను వదిలి చెన్నై కి వచ్చి వసంత గారి షెడ్యూల్ చూసేవారట. ఆయన ప్రోత్సాహం వల్లే ఎన్నో పాటలు పాడగాలిగాను అంటూ వసంత గారు తెలిపారు.

థమన్ కి ఫోన్ చేసినా ఎత్తడు…

ఇక వసంత గారి చెల్లి కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. ప్రస్తుతం థమన్ సక్సెస్ చూస్తున్నపుడు చాలా ఆనందంగా ఉంటుందని, నేను సాధించలేనిది నా కొడుకు సాధించాడనిపిస్తుందంటూ చెప్పారు వసంత. అయితే థమన్ చాలా బిజీగా ఉంటున్నాడని వాళ్ళ ఇంటికే వెళ్లడం తక్కువగా ఉంటోందంటూ చెప్పారు. వాళ్ళ అమ్మా ఫోన్ చేసినా ఎత్తడు. ఒకవేళ చెన్నై కి వచ్చి టైం ఉంటే ముందే ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఏం తినాలో అది వండించుకుంటాడు, చాలా బిజీ అయిపోయాడు అంటూ చెప్పారు. తన సినిమాలో ఒక పాట పాడించుకున్నాడని చెప్పారు వసంత. బృందావనం సినిమాలో “బృందావనం అది అందరిది గోవిందుడు అందరివాడేలే” పాటను పాడించుకున్నాడని అందుకు ఐదు వేలు రెమ్యూనరేషన్ ఇచ్చాడని థమన్ గురించి వసంత గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago