Categories: FeaturedGeneral News

అస్తిపంజరం పక్కన ఉంటేనే ఈ బుడ్డోడు భోజనం చేస్తాడు.. లేదంటే ఇల్లు పీకి పందిరేస్తాడు!

ప్రస్తుతం కాలంలో పిల్లలు తినాలన్నా పడుకోవాలన్న పక్కన సెల్ ఫోన్ ఉండాల్సిందే. ఒక్క నిమిషం సెల్ లేకపోతే ఒక్క ముద్ద కూడా నోటిలోకి దిగదు. అదేవిధంగా వాడు పడుకోవాలి అన్న పక్కన సెల్లు ఉంటే దానిని చూస్తూ అలాగే నిద్ర పోతారు. ఇది ప్రస్తుతం పిల్లలకున్న అలవాటు. కానీ అమెరికాకు చెందిన అబిగైల్ బ్రాడికి 2 సంవత్సరాల కొడుకు థియో ఉన్నాడు. ఈ బుడ్డోడికి మాత్రం పక్కన అస్తిపంజరం లేకపోతే పాలు పోదు. ఏంటి అస్తిపంజరం ఆశ్చర్యపోతున్నారా.. అవును ఈ బుడ్డోడికి పక్కన అస్తిపంజరం లేకపోతే ఒక్క ముద్ద అన్నం కూడా తినడు.

అందరి పిల్లలు మాదిరి కాకుండా ఈ బుడ్డోడు అస్తిపంజరంతో సావాసం చేస్తున్నాడు. ఒక్క నిమిషం అస్తిపంజరం కనపడకపోయినా ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అయితే అది నిజమైన అస్తిపంజరం కాదు బొమ్మ అస్తిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు ఇలాంటి భయంకరమైన బొమ్మలను చూస్తే భయపడతారు. కానీ థియో మాత్రం దానితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు.

ఒకరోజు అమెరికాలో జోరు వాన కురుస్తూ డ్రైనేజీలు పొంగి పొర్లతున్నాయి. ఈ క్రమంలోనే థియో తల్లిదండ్రులు ఇంటి బేస్మెంట్లో ఉన్న వస్తువులను పైకి తెచ్చారు. ఆ వస్తువులలో హాలోవీన్ రోజున ఇంటి బయట తగిలించే అస్థిపంజరం బొమ్మ కూడా ఉంది. అప్పటి నుంచి ఆ బొమ్మను ఒక్క నిమిషం వదలడం లేదు. తను ఏ పని చేసిన పక్కన తన ఫ్రెండ్ అయినటువంటి బెన్నీ అస్తిపంజరం ఉండాల్సిందే.

తాజాగా థియో మరో కుక్క అస్తిపంజరం బొమ్మను కూడా కొనుక్కున్నాడు. ఈ రెండు అస్థిపంజరాలతో థియో ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే థియో వింత అభిరుచులను తన తల్లి బ్రాడి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. వాటిని చూసి నెటిజనులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago