ప్రస్తుతం కాలంలో పిల్లలు తినాలన్నా పడుకోవాలన్న పక్కన సెల్ ఫోన్ ఉండాల్సిందే. ఒక్క నిమిషం సెల్ లేకపోతే ఒక్క ముద్ద కూడా నోటిలోకి దిగదు. అదేవిధంగా వాడు పడుకోవాలి అన్న పక్కన సెల్లు ఉంటే దానిని చూస్తూ అలాగే నిద్ర పోతారు. ఇది ప్రస్తుతం పిల్లలకున్న అలవాటు. కానీ అమెరికాకు చెందిన అబిగైల్ బ్రాడికి 2 సంవత్సరాల కొడుకు థియో ఉన్నాడు. ఈ బుడ్డోడికి మాత్రం పక్కన అస్తిపంజరం లేకపోతే పాలు పోదు. ఏంటి అస్తిపంజరం ఆశ్చర్యపోతున్నారా.. అవును ఈ బుడ్డోడికి పక్కన అస్తిపంజరం లేకపోతే ఒక్క ముద్ద అన్నం కూడా తినడు.

అందరి పిల్లలు మాదిరి కాకుండా ఈ బుడ్డోడు అస్తిపంజరంతో సావాసం చేస్తున్నాడు. ఒక్క నిమిషం అస్తిపంజరం కనపడకపోయినా ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అయితే అది నిజమైన అస్తిపంజరం కాదు బొమ్మ అస్తిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు ఇలాంటి భయంకరమైన బొమ్మలను చూస్తే భయపడతారు. కానీ థియో మాత్రం దానితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు.
ఒకరోజు అమెరికాలో జోరు వాన కురుస్తూ డ్రైనేజీలు పొంగి పొర్లతున్నాయి. ఈ క్రమంలోనే థియో తల్లిదండ్రులు ఇంటి బేస్మెంట్లో ఉన్న వస్తువులను పైకి తెచ్చారు. ఆ వస్తువులలో హాలోవీన్ రోజున ఇంటి బయట తగిలించే అస్థిపంజరం బొమ్మ కూడా ఉంది. అప్పటి నుంచి ఆ బొమ్మను ఒక్క నిమిషం వదలడం లేదు. తను ఏ పని చేసిన పక్కన తన ఫ్రెండ్ అయినటువంటి బెన్నీ అస్తిపంజరం ఉండాల్సిందే.
తాజాగా థియో మరో కుక్క అస్తిపంజరం బొమ్మను కూడా కొనుక్కున్నాడు. ఈ రెండు అస్థిపంజరాలతో థియో ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే థియో వింత అభిరుచులను తన తల్లి బ్రాడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వాటిని చూసి నెటిజనులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























