టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమాకు ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలో తెలియజేశారు. అయితే అతడు ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం గురించి చిత్రబృందం తాజా అప్డేట్ అందించారు.
అజయ్ దేవగన్ ఈ సినిమాలో కొమరం భీమ్ తండ్రి పాత్రలో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్రలో సందడి చేయనున్నారు. అజయ్ దేవగన్ పాత్ర సినిమాలో చాలా హైలెట్ కానుందట. అందుకే దర్శకుడు ఈ పాత్ర పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నుంచి రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి లాంటి స్టార్స్ కూడా భాగమవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…