రీల్ లైఫ్‌లో నెగెటివ్ షేడ్స్ వున్న విలన్ కాస్త రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి రియల్ హీరోగా మారిపోతే ఎలా వుంటుంది. ఊహించుకోవడానికే అద్భుతంగా వున్న ఈ అందమైన ఊహ ఇప్పుడు సోషల్ మీడియాలో నిజమై కనబడుతుంది. అవును.. కరోనా కష్టకాలంలో కలియుగ కర్ణుడి అవతారమెత్తారు సోనూసూద్. ‘అరుంధతి’, ‘దూకుడు’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన శైలిలో పరిచయమైన సోనూసూద్ విలన్ గా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా నటించినా.. రియల్ లైఫ్ లో మాత్రం చాలా మంది జీవితాలలో వెలుగును నింపిన ‘సూపర్ హీరో”గా మారిపోయాడు.
‘నేనున్నాననీ.. నీకేం కాదనీ..’ అంటూ కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంటున్న సోనూ సూద్ మరోసారి నెటిజన్లందరి దృష్టిని ఆకర్షించాడు. ఈమధ్యనే ఓ బాలుడు అడిగిన ప్రశ్నకు మన రియల్ హీరో సోనూసూద్ ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ‘ఇంతకీ అసలు ఆ బాలుడు సోనూసూద్ ని ఏమడిగాడు.? ఆ బాలుని ప్రశ్నకు సోనూ సూద్ ఏం సమాధానం చెప్పాడు.? అనే కదా.. మీ సందేహం..?
మరిన్ని వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి మీకుంటే.. మీరే చదివి తెలుసుకోండి.
కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి నేనున్నానంటూ తోచిన సహాయం చేస్తున్న.. రియల్ హీరో సోనూసూద్ కు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో విచిత్రమైన అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే.. ఆ రిక్వెస్ట్ లను కూడా సరదాగా ఫాలో అవుతూ.. సోనూసూద్ బదులిస్తున్నారనడానికి ఉదాహరణగా.. నీలేశ్ నింబోరే అనే బాలుడిని అభ్యర్ధననే చెప్పవచ్చు. ఈ బాలుడు ఓ విచిత్రమైన కోరిక కోరాడు. ‘తన చుట్టూ ఉన్నవాళ్లందరూ.. ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుతుంటే.. తాను మాత్రం ఆ గేమ్స్ ను ఆడలేక చూస్తూ.. ఉండి పోతున్నానని, అలాంటి వీడియో గేమ్ లను ఆడుకోవడానికి వీలుగా.. ప్లే స్టేషన్ -4 గేమింగ్ కన్సోల్ కొనివ్వాలి” అని కోరాడు. సోషల్ మీడియాలో ఈ అభ్యర్ధన బాగా వైరల్ అయ్యింది. లేటెస్టుగా సోనూసూద్ ఈ బాలుని అభ్యర్ధనకు సరదాగా స్పందించారు. “నీ దగ్గర ప్లే స్టేషన్ లేకపోతే ఏం.? నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. కొన్ని పుస్తకాలు తెచ్చుకో.. చదువుకో.. పుస్తకాల కోసం సహాయం చేయమంటే.. తప్పకుండా చేస్తాను” అంటూ ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…