ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.ఇండియాలో కరోనా రెండోదశ ఏ స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టడంతో భారతదేశంలో లాక్ డౌన్ సడలించారు.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన జనాలు ఉన్నపళంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అయితే బయటకు వచ్చిన వారు మాస్కు పెట్టుకొని తగినన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మరోసారి ప్రమాదం తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో సిమ్లా, ధర్మశాల వంటి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాజాగ ధర్మశాలలో ఉన్న పర్యాటకులు ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ళ కుర్రాడు మాస్కు ధరించి అటుగా మాస్క్ లేకుండా వస్తున్న వారిని ఒక ప్లాస్టిక్ కర్ర తీసుకొని మాస్కులు ధరించండి అంటూ వారిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బుడతడు పెద్దవారికి మాస్కు జాగ్రత్తలు చెబుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఈ కుర్రాడు మాస్కులు ధరించండనీ చెబుతుండగా కొందరు నవ్వుతూ వెళ్లడమే కాకుండా మరికొందరు చిన్నోడిని అసహ్యించుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కనీసం కుర్రాడికి ఉన్న బుద్ధి కూడా పెద్దవారికి లేదా.. అసలు వీళ్ళు మనుషులేనా అంటూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…